రోజు రోజుకు ఆడపిల్లల మధ్య అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.. చిన్నపిల్లులు, వృద్ధులు అనే తేడా లేదు. అభశుభం తెలియని చిన్నపిల్లలను బెదిరించి టీచర్లే అత్యాచారం చేస్తున్న దారుణమైన ఘటనలు రోజూ ఏదూ ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. స్కూల్‌కు వెళ్లనని మారం చేస్తే.. మనం పిల్లలు స్కూల్‌కు వెళ్లకపోతే చదువు పాడవుతందని తిట్టి, కొట్టి పంపిస్తాం. ఇలా జరుగుతుంది అని చెప్పుకోలేని పరిస్థితి వాళ్లది. తాజాగా నెల్లురు నక్షత్రా స్కూల్లో జరిగిన ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.. దీనికి మించిన ఘోరం ఒకటి యూపీలో జరిగింది. 9వ తరగతి విద్యార్థిని బెదిరిస్తూ.. రెండేళ్లుగా ఉపాధ్యాయుడు రేప్ చేస్తున్నాడు.
సౌరభ్ గుప్తా ఘజియాబాద్‌లోని ఒక పాఠశాలలో కంప్యూటర్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో చదివే విద్యార్థినిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. మొదట, కంప్యూటర్ నేర్పిస్తానని, మంచి మార్కులు వచ్చేలా చూస్తానని చెప్పి ఆ బాలికను లోబర్చుకున్నాడు. ఆ తరువాత గ్రేడ్స్ తక్కువ వచ్చేలా చేస్తానని, ఫెయిల్ చేస్తానని బెదిరించి, లైంగిక దాడి చేయడం ప్రారంభించాడు. గత రెండేళ్లుగా ఆ బాలికను బెదిరిస్తూ, అత్యాచారం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులకు గానీ, మరెవరికైనా కానీ చెపితే, ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడు.
ఇటీవల శ్రద్ధ వాకర్ దారుణ హత్య తరువాత.. ఆ రీతిలో పలు హత్యలు కూడా జరిగాయి.. ఇదే క్రమంలో ఆ బాలికను బెదిరించడానికి ఈ టీచర్ అంశాన్ని కూడా వాడుకోవడం ప్రారంభించాడు. ఎవరికైనా చెబితే.. ఆఫ్తాబ్ శ్రద్ద వాకర్‌ను ముక్కలు ముక్కలుగా నరికినట్లు నరికేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. చివరకు ఆ బాలిక ధైర్యం కూడగట్టుకుని ఈ దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.
ఆ బాలిక తల్లిదండ్రులు నంద్ గ్రామ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కీచక టీచర్‌ను అరెస్ట్ చేశారు. వేరే కొందరు బాలికలపై ఇలా బెదిరించి అత్యాచారం చేసినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. అతడిపై ఐపీసీ, పొక్సొ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పర్చారు.
పాపం ఆ బాలిక బాల్యం అంతా నాశనం అయింది.. చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. పేరెంట్స్ అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడే అన్నీ ఫ్రీగా చెప్పుకోగలుగుతారు. దేనికి భయపడకూడదని, బెదిరింపులకు అస్సలు తగ్గద్దొని నేర్పించాలి.. లేకుంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి బెదిరించి అమ్మాయిలను ఆటబొమ్మలు చేసి వాళ్ల జీవితాన్ని నాశనం చేసే రాక్షసులు చుట్టూనే ఉన్నారు..