మొదటి డోస్ సెకండ్ డోస్ గ్యాప్ పెంచుతారా…?

-

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆక్స్ఫర్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ రెండు డోస్ ల మధ్య అంతరాన్ని 12-16 వారాలకు పెంచాలి అంటూ ప్రభుత్వ ప్యానెల్ సిఫార్సు చేసింది. ప్రస్తుతం, కోవిషీల్డ్ రెండు మోతాదుల మధ్య విరామం నాలుగు నుండి ఎనిమిది వారాలుగా ఉంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎదురుచూస్తున్న వారు కోలుకున్న తర్వాత ఆరు నెలల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.

నేషనల్ ఇమ్యునైజేషన్ ఆన్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్‌టిఐజి) ఈ మేరకు సూచనలు చేసింది. గర్భిణీ స్త్రీలకు ఏ ఇబ్బంది లేదు అని స్పష్టం చేసారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ మరియు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ ని ప్రస్తుతం మన దేశంలో అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news