ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, వెంటనే ఆటో డైవర్ల జీవన సమస్యలపై స్పందించాలి: హరీష్ రావు

-

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అయినా నాటి నుంచి బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. ఈ కారణంగా ఆటోలో ఎవరు ఎక్కడము చాలామంది ఆటో డ్రైవర్స్ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

 

ఆటో నడవటం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం అని హరీష్ రావు అన్నారు. తల్లి, తండ్రిని కోల్పోయి, అనాధగా మారిన ఆ బిడ్డ భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవరు భరోసా ఇస్తారు. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన పై ప్రభుత్వం తక్షణం స్పందించి పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేశారు.

 

రాష్ట్రంలో వరుసగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు అని మండిపడ్డారు. నిర్లక్ష్యం వీడి, ప్రభుత్వం వెంటనే ఆటో డైవర్ల జీవన సమస్యకు పరిష్కారం చూపాలి అని అన్నారు. 12 వేల భృతి ప్రకటించాలి అని విజ్ఞప్తి చేశారు. ఆటో సోదరులు ధైర్యంగా ఉండాలని, తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాను అని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news