మరోసారి భూములను వేలం వేయనున్న ప్రభుత్వం

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి ప్ర‌భుత్వ భూముల‌ను వేలం ద్వారా విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. టీఎస్ఐఐసీ,హెచ్ఎండీఏ తో పాటు జిల్లాల ప‌రిధిలో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను వేలం వేయాడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధం అవుతుంది. మార్చి 14 నుంచి 17 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు భూముల‌ను వేలం వేయ‌నుంది. వేలానికి సంబంధించిన స‌మాచారం టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలో గ‌ల భూముల వివ‌రాలు ఆయా అధికారిక వెబ్ సైట్ లో ఉండ‌నున్నాయి.

అలాగే జిల్లాల్లో వేలం వేసే భూముల వివ‌రాలు ఆయా జిల్లాల అధికారిక వెబ్ సైట్ల‌లో ఉంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే వేలం భౌతికంగా జ‌రుగుతుంద‌ని తెలిపింది. అలాగే ప‌ట్ట‌ణాల్లో ఉండే భూముల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని వెంట‌నే నిర్మాణాలు ప్రారంభించే విధంగా ఉన్నాయ‌ని తెలిపింది. అలాగే ఆయా భూముల‌లో అంత‌ర్గత దారులు, వీధి దీపాల‌ను ఈ ఏడాది డిసెంబర్ నెల వ‌ర‌కు పూర్తి చేస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. కాగ వేలం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం 1,408 ప్లాట్ల ను విక్ర‌యించ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news