గ్రేట‌ర్ లో గులాబీ! స్టాండింగ్ క‌మిటీ ఏకగ్రీవం

-

జీహెచ్ ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ఏక‌గ్రీవం అయింది. అధికార టీఆర్ఎస్ తో పాటు దాని మిత్ర ప‌క్ష‌మైన ఎంఐఎం లు స్టాండింగ్ క‌మిటీ పూర్తిగా ఏక‌గ్రీవం చేశారు. మొత్తం 15 స్థానాలు ఉండ‌గా.. 15 మంది మాత్ర‌మే పోటీలో ఉండ‌టం తో వారు విజయం సాధించినట్టు జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ ప్ర‌క‌టించారు. అయితే ముందుగా 15 స్థానాల‌కు 18 మంది పోటీ లో ఉన్నారు. అయితే అనేక చ‌ర్చల అనంత‌రం టీఆర్ఎస్ నుంచి ముగ్గురు త‌మ నామినేష‌న్ ల‌ను విత్ డ్రా చేసుకున్నారు.

దీంతో ఎన్నిక ఏక‌గ్రీవం అయింది. దీంతో స్టాండింగ్ క‌మిటీ లో అధికార టీఆర్ఎస్ నుంచి 8 మంది ఉన్నారు. అలాగే ఎంఐఎం నుంచి 7 గురు ఉన్నారు. అయితే ముందుగా టీఆర్ఎస్, ఎంఐఎం 9, 6 చోప్పున స్థానాల‌ను తీసుకున్నారు. కానీ నామినేష‌న్లు మాత్రం 11, 7 గా వేశారు. అదనంగా ఉన్న ముగ్గురు పోటీ లో ఉండ‌టం తో అనేక చ‌ర్చ‌ల త‌ర్వాత టీఆర్ఎస్ నుంచి ముగ్గురు తప్పుకున్నారు. కాగ‌ స్టాండింగ్ కమిటీ సభ్యులు గెలిచిన వారు టీఆర్ఎస్ నుంచి కుర్మ హేమలత, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, మందాడి శ్రీనివాస్ రావు, రావుల శేషగిరి, సీఎన్ రెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, సామల హేమ ఉన్నారు. అలాగే మజ్లిస్ పార్టీ నుంచి ప్రవీణ్ సుల్తానా, బాత జబీన్, మహాపార, మందగిరి స్వామి, మీర్జా ముస్తాఫ బేగ్, మహమ్మద్ అబ్దూల్ సలామ్, ఎండీ రషీద్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news