వెదురుతో తిరుగులేని అందం మీ సొంతం.. అన్ని సమస్యలకు సింగిల్ సొల్యూషన్..!

-

మచ్చలు లేని ముఖం, నిగారించే చర్మం కావాలని అందరూ అనుకుంటారు. దానికోసం ఏవేవో క్రీమ్స్ కూడా వాడుతుంటారు. ఏదైనా నాచురల్ పద్దతితలో ఫాలో అయితేనే..రిజల్ట్ లేటుగా ఉన్నా..పర్మినెంట్ సొల్యూషన్ వస్తుంది. ఇందులో వెదురు మీ అందాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడుతుందంటున్నారు.. సౌందర్య నిపుణులు. వెదురులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందం విషయంలో మనం ఎదుర్కొనే సమస్యల్ని దూరం చేస్తాయట. కొరియన్లు ఎక్కువగా దీన్ని వారి బ్యూటీ కిట్‌లో భాగం చేసుకుంటారు. అందుకే వాళ్లు అంత అందంగా ఉంటారు.
 వెదురుతో జుట్టు అందానికి..
వెదురులో సిలికా, కొలాజెన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగాఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేసి నవయవ్వనంగా కనిపించేలా చేస్తాయి. సిలికా చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. వెదురులోని సిలికా చర్మ సౌందర్యానికే కాదు.. జుట్టు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషకాలను అందించడంతో పాటు రక్తప్రసరణ, ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా, షైనీగా పెరుగుతుంది.
వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన సౌందర్య సాధనాల్ని ఉపయోగించమంటున్నారు నిపుణులు. తద్వారా మొటిమల సమస్యకు కూడా చెక్‌ పెట్టేయొచ్చు. డీటాక్సిఫై ఏజెంట్‌గా వెదురుకు పేరుంది. కాబట్టి దీంతో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులు/సాధనాల్ని తరచూ ఉపయోగించడం వల్ల చర్మంలోని మలినాల్ని తొలగించుకొని కాంతివంతంగా ఉండొచ్చు.
వెదురు ఎక్స్‌ట్రాక్ట్స్‌లో ఉండే అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు.. సూర్యరశ్మిలో ఉన్న అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా రక్షిస్తాయి.
ఫ్రీరాడికల్స్ వల్ల ముఖంపై ముడతలు, గీతలు.. వంటివి ఏర్పడే ప్రమాదముంది. అదే వెదురుతో తయారుచేసిన ఉత్పత్తుల్ని తరచూ వాడితే మంచి ఫలితం ఉంటుంది. పైగా చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.
వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి చర్మ అలర్జీలు, రాషెస్, సొరియాసిస్‌.. వంటి చర్మ సమస్యల్ని దూరం చేయడంలో సహకరిస్తాయి. అందుకే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన క్లెన్సర్లు, బాడీవాష్‌లను చర్మానికి ఉపయోగించడం మేలంటున్నారు సౌందర్య నిపుణులు.
వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన గోళ్ల ఉత్పత్తుల్ని వాడడం వల్ల గోళ్లు బాగా పెరుగుతాయట.
ఎలా వాడాలి?
ప్రస్తుతం ఇది మార్కెట్లో సీరమ్‌, షీట్‌ మాస్కులు, ఫేస్‌ మిస్ట్‌, మాయిశ్చరైజర్లు, క్లెన్సర్ల రూపంలో అందుబాటులో ఉంది. అలాగే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌ పరిమాణం ఎక్కువగా ఉన్న కొరియన్‌ బ్యూటీ ఉత్పత్తుల్ని కూడా నిపుణుల సలహా మేరకు వాడచ్చు. ఇక జుట్టు విషయానికొస్తే.. వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన షాంపూలు, కండిషనర్లు మార్కెట్లో ఉన్నాయి. గోళ్లను దృఢంగా చేసే క్రీమ్స్‌, వెదురుతో తయారుచేసిన మానిక్యూర్‌ స్టిక్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏది ఎంచుకున్నా ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news