బీహార్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. సరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యా యత్నం కేసులో ఆ మహిళా డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బాధిత వ్యక్తి మధురా బ్లాక్‌లోని వార్డు నెంబర్ 12 కౌన్సిలర్. ప్రస్తుతం అతన్ని పాట్నా మెడికల్ కాలేజీలో చికిత్స కోసం చేర్పించారు.
గత అయిదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో ఆ లేడీ డాక్టర్ రిలేషన్‌లో ఉన్నది. ఈ విషయాన్ని ఆమె కూడా అంగీకరించింది. అయితే పెళ్లి చేసుకునేందుకు ఆ వ్యక్తి నిరాకరించడంతో.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు కూడా లేడీ డాక్టర్ సిద్దమైంది. పెళ్లి కోసం ఆమె కోర్టుకు వెళ్లింది. కానీ బాధిత వ్యక్తి మాత్రం రాలేకపోయాడు. బాయ్‌ఫ్రెండ్ వ్యవహారంపై విరక్తి చెందిన ఆ డాక్టర్.. తన ఇంటికి అతన్ని పిలిచింది. ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్ పురుషాంగాన్ని కట్ చేసింది లేడీ డాక్టర్. అయితే కౌన్సిలర్ అరుపులు విన్న స్థానికులు .. జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలిపారు. బెడ్‌పై రక్తపు మడుగులో ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.