ఇటీవల జగిత్యాల రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సిట్టింగ్ ఎడిట్ పేజీ రాజకీయం ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరికతో ఆ పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళలు నెలకొన్నాయి. అక్కడున్న కాంగ్రెస్ సీనీయర్ నేత జీవన్ రెడ్డి, సంజయ్ తమ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. తనకకు కనీస సమాచారం లేకుండా సీఎం రేవంత్, సిట్టింగ్ ఎమ్మెల్యేను పార్టీలో ఎలా చేర్చుకుంటారని బహిరంగంగానే ప్రశ్నించారు. ఒకానొక దశలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ పెద్దలు జీవరెడ్డి నచ్చజెప్పి ఆ గొడవను అప్పటికప్పుడు సద్దుమణిగేలా చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం సంజయ్ జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజవర్గంలో ఇప్పటి వరకు 4,300 ఇళ్లను పూర్తి చేశామని తెలిపారు.
ఆ ప్రాంతానికి మౌలిక వసతులు కల్పనకు నిధులు అవసరం అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయత్రం రూ.32 కోట్ల 16 లక్షలు నిధులు మంజూరు చేస్తూ జీవో కూడా జారీ చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీ ఇచ్చారని అన్నారు. రైతు సమస్యలపై రేవంత్ ప్రభుత్వం ఫోకస్ చేస్తోందని సంజయ్ అన్నారు. నియోజకవర్గానికి మరికొన్ని ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు.