ఆ కోతి ముక్కు ఎంత పొడవుగా ఉంటే.. ఆడ కోతులు అంత ఇష్టపడతాయట..!

-

జూపార్క్ లో మనం విచిత్రమైన జంతువులను, పక్షులను చూస్తాం.. కానీ మీరు జూపార్క్ లో కూడా చూడలేని చాలా జంతువులు, విచిత్రమైన పక్షులు ఈ భూమ్మీద బోలెడు ఉన్నాయి. అవి ఉండే ఆకృతిని బట్టే అవి ప్రత్యేకం. ఇలాంటి వాటి గురించి ఈ సైట్ లో ఇప్పటికే అందించాం.. ఈరోజు మరికొన్ని వింత జంతువులు గురించి చూద్దాం..

1. ఏనుగు తొండం లాంటి ముక్కుతో కోతి:

బోర్నియా దీవిలో ప్రోబోసిస్ కోతులు (proboscis monkey) ఉంటాయి. వీటి రూపు రేఖలు భలే చిత్రంగా ఉంటాయి. వీటి ముక్కు ఏనుగు తొండంలా ఉంటుంది.. ఇలా మగ కోతులకు మాత్రమే ఉంటోందట.. ఈ ముక్కే ఆడకోతుల్ని ఆకర్షిస్తుంది. ఎంత పెద్ద ముక్కు ఉంటే… ఆడ కోతులు అంతలా ఎట్రాక్టివ్ అవుతాయట. ఇదేదే తేడాగా ఉందే… ఈ కోతులు చెట్లపై జీవిస్తాయి. చాలా కోతుల లాగే ఇవి శాఖాహారులు. ఇవి చిత్తడి నేలలు ఉన్నచోట ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి ఇవి బాగా ఈదగలవు. తెలివైన ఈ కోతులు… నీటిలో వెళ్లేటప్పుడు మొసళ్లు దాడి చెయ్యకుండా… చేతులు, కాళ్లతో ఈజీగా తప్పించుకుంటాయట.

2. జీబ్రా లాగా కనిపించే ఒకాపీ:

దీని పేరు ఓకాపి (Okapi).. కాంగోలోని ఇటురి రెయిన్‌ఫారెస్ట్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఇది జిరాఫీ, జీబ్రా పోలికలతో ఉంటుంది.. జిరాఫీలా కనిపించే ఏకైక సజీవ జంతువు కూడా ఇదే. దీని బొచ్చు చాలా జిడ్డుగా ఉంటుంది. ఎంతటి వర్షాన్ని అయినా ఇది తట్టుగోగలదు. గట్టి మొక్కలతో పాటూ.. నది ఒడ్డున ఉన్న మట్టి, గబ్బిలాల రెట్టలను కూడా తింటుంది. ఇది ఇప్పుడు అరుదైన జంతువుల జాబితాలోకి వెళ్లింది.. కొన్ని ఏళ్లకు ఈ రకమైన జంతువులు భూమిపైన కనపడకపోవచ్చు.

3. ఆక్సోలోట్

దీని ముఖం నవ్వుతున్నట్లు ఉంటుంది. ఎప్పుడు చూసినా అందంగానే ఉంటుంది. దీన్ని మెక్సికో చాలా ప్రజలు ఇష్టంగా పెంచుకుంటారు. నిజానికి ఇవి సాలమండర్ల (salamanders) జాతికి చెందినవి. మెక్సికో నగరంలోని జోచిమిల్కో జలాల్లో మాత్రమే ఇవి జీవిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య తగ్గిపోతోంది. ఎందుకంటే… చాలా మంది వీటిని ఆక్వేరియంలో పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవి తినేందుకు కూడా అనూకూలం అ‌వడంతో.. వండుకుని తింటానికే ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు.

4. గిట్టలు ఉన్న కుందేళ్లు..

పిల్లులు, కుందేళ్లకు గిట్టలు ఉండవు. పెటగోనియా కుందేళ్లు (Patagonian hare) మాత్రం గిట్టలు కలిగివుంటాయి. అందుకే ఇవి ప్రత్యేకం. వీటి శరీరం కుందేళ్లది అయితే… కాళ్లేమో మేకలా ఉంటాయి.. ఇవి కుందేళ్ల లాగా దూకుతాయి. కానీ స్టోట్ అని పిలిచే వింత నడకను కలిగి ఉంటాయి, ఇందులో ఇవి నాలుగు కాళ్లపై ఎగురుతాయి. ఈ టైప్ జంతువులు ఎక్కువగా అర్జెంటినాలో కనిపిస్తాయి. ఇవి 16 కేజీల దాకా బరువు ఉంటాయి.

5. పాములా కనిపించే తాబేలు:

తాబేళ్లు సాధారణంగా తల బయటకు పెట్టవు. పొడవైన మెడ ఉండే తాబేలు. తల బయటకు పెడుతుంది. అందుకే దీన్ని పాము లాంటి మెడ ఉన్న తాబేలు (snake-necked turtle) అంటారు. ఈ జాతి జీవుల్లో 16 దాకా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూ గినియాలో ఉంటాయి. ఇవి తమ మెడతో చేపల్ని గుటుక్కున పట్టుకొని తినేస్తాయట.. పెద్ద మెడ కావడం వల్ల దీన్ని తన డిప్పలో దాచుకునేందుకు వీలు కాదు. ఎంత లోపలికి జరుపుకున్నా… ఇంకా చాలా మెడ బయటకే ఉంటుంది. అందుకే తాబేళ్లలో ఇవో ప్రత్యేకరకంగా నిలిచాయి.

6. మోసం చేసే బ్యాట్ ఫిష్..

ఇవి చాలా తెలివైన చేపలు. ప్రకృతి తమకు ఇచ్చిన ప్రత్యేక ముఖాన్ని కరెక్టుగా వాడుకుంటాయి… ఇవి సముద్రంలో కదలకుండా ఉంటూ… తలని మాత్రం గోడ గడియారంలోని పెండ్యులం లాగా అటూ ఇటూ కదుపుతూ ఉంటాయి. అది చూసిన చేపలు… ఆహారం అనుకొని దీని దగ్గరకు వస్తాయి. అలా వచ్చీ రాగానే… ఈ చేప ఒక్కసారిగా నోరు తెరచి… ఎదురుగా ఉన్న చేపల్ని మింగేస్తుంది. ఇవి గాలాపగోస్ దీవుల జలాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి రెక్కలతో ఈదకుండా… నడుస్తూ వెళ్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news