కరోనా కేసులకు ఎన్నికల కమీషన్ కారణం: హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

-

కరోనా కేసుల విషయంలో మద్రాస్ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ర్యాలీలు, బహిరంగ సభలు ఎందుకు ఆపలేదని ప్రశ్నించింది. కరోనా సెకండ్ వేవ్ కి ప్రధాన కారణం ఎన్నికల సంఘమే అని అభిప్రాయపడింది. ఎన్నికల కమీషన్ అధికారులపై మర్డర్ కేసులు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించింది. కౌంటింగ్ కి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పాలని కూడా ఆదేశించింది.

కౌంటింగ్ కి తీసుకున్న జాగ్రత్తలను బ్లూ ప్రింట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. మే 2 న కౌంటింగ్ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంది. లేకపోతే ఎన్నికలను రద్దు చేస్తామని హెచ్చరించింది. కాగా తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనితో అక్కడ లాక్ డౌన్ కూడా విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news