సరిపోదా శనివారం మూవీ నుంచి సెకండ్ లుక్ విడుదల చేసిన మేకర్స్

-

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది .తాజాగా, ఈ మూవీ మేకర్స్ సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు.నాని బైక్ పై హ్యాండ్ బ్యాగ్‌ వేసుకొని కూల్ గా వెళ్తున్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ లుక్ ని చూసి నెటిజెన్స్ నాని ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటని తెగ ఆలోచిస్తున్నారు. కొద్దీ రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే భిన్నమైన కథాంశంతో రానుంది..

Read more RELATED
Recommended to you

Latest news