అభిమానులకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన కల్కి మేకర్స్

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9 న 2024లో రిలీజ్ కానుంది.వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు మే 9 న రిలీజైన సంగతి తెలిసిందే.ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ కూడా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ అందించడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ చిత్ర యూనిట్ ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.మొన్నటివరకు హీరో ప్రభాస్.. విదేశాల్లో ఉన్నాడని, వచ్చాకా షూటింగ్ స్టార్ట్ అవుతుందని వారు తెలిపారు. ఇవన్నీ కాదు.. కనీసం షూటింగ్ అప్డేట్స్ అయినా ఇవ్వండి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండగాఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇండియాలో కీలక షెడ్యూల్స్ ను పూర్తిచేసుకున్న కల్కి మూవీ టీం తాజాగా ఇటలీకి బయల్దేరుతున్నట్లు వెల్లడించారు. ఇటలీలో సాంగ్ షూటింగ్ జరగనుందని తెలిపారు. ఇటలీలో ఆటాపాటా అంటూ.. చిత్ర బృందం మొత్తం ఇటలీకి బయల్దేరుతున్నప్పుడు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news