బర్రెపై అత్యాచారం చేస్తూ వ్యక్తి బలి… తోక మెడకు చుట్టుకుని మరీ!

రోజులు మారినా కొద్ది… మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. వాయి, వరుస లేకుండా మహిళలపై దాడి చేస్తున్నారు. ఇక మరికొందరైతే.. అభం.. శుభం తెలియని మూగ జీవులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వనపర్తి జిల్లాలోని నాగవరంలో అదే ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల నాగరాజు కూలీగా పని చేస్తుండేవాడు. అయితే.. నాగరాజుకు పశువులపై అత్యాచారం చేసే అలవాటు ఉంది.

ఈ నేపథ్యంలోనే నాగవరంలోని బాల్‌ రెడ్డి అనే యజమానికి చెందిన బర్రెలను తన ఇంటి ముందు కట్టేసి ఉంచాడు. దీంతో శనివారం రాత్రి వాటిపై నాగరాజు అత్యాచారం చేయబోయాడు. అయితే… తెల్లారి లేచి చూసిన ఇంటి యజమాని బాల్‌ రెడ్డి షాక్‌ అయ్యాడు. బర్రె తోకకు చట్టుకుని పశువుల కొట్టంలోనే పడి ఉన్న నాగరాజు కనిపించాడు. దీనిని గమనించిన వెంటనే.. బాల్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కు పంపించారు. ఈ రిపోర్టులో… నాగరాజు బర్రెలపై అత్యాచారానికి ప్రయత్నం చేసినట్టు బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్ధారించారు.