75వ స్వాతంత్ర్య దినోత్సవం.. 100లక్షల కోట్ల ప్రణాళికను ప్రకటించిన ప్రధాని.

-

75వ స్వాతంత్ర్య దినోత్సవంతో భారతదేశం మరో మైలు రాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రసంగించిన ప్రధాని, జాతినుద్దేశించి మాట్లాడారు. కరోనా సహా అనేక విషయాల గురించి ప్రసంగించిన ప్రధాని, 100లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రవేశ పెట్టారు. రాబోయే రెండేళ్ళలో ఈ ప్రణాళికను అమలు చేయాలని, అందుకు తగిన ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

100లక్షల కోట్ల ప్రణాళిక మౌలిక సదుపాయాలకు ప్రాధ్యాన్యత ఇస్తుందని, విద్య, వైద్యం, కనీస అవసరాలను అందరికీ అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ ప్రసంగంలో ఒలింపిక్ ఆటలకు వెళ్ళిన అందరినీ ప్రశంసించారు. వారంతా దేశానికే ఆదర్శంగా నిలిచారని, యువతలో స్ఫూర్తి నింపారని కొనియాడారు. ఇంకా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి మాట్లాడుతూ, దేశాన్ని వేధిస్తున్న మహమ్మారి నుండి దేశాన్ని కాపాడేందుకు అనుక్షణం పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారా మెడికల్ స్టాఫ్, నర్సులు సహా అందరినీ పొగిడారు.

కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ మనమే చేపడుతున్నామని, ఇప్పటి వరకు 54కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇంకా మిగిలిన వారికి త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు.

ప్రస్తుతం ప్రకటించిన ప్రణాళిక ద్వారా దేశం మరింత అభివృద్ధి చెందాలి. వందశాతం గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉండాలి. ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలి. ఉజ్వల పథకం కింద అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షను ఉండాలి. భేటీ బచావో, భేటీ పడావో ద్వారా ఆడపిల్లల్లో చైతన్యం కలిగించాలి. ప్రస్తుతం విద్య అయినా, ఆటలైనా ఆడవాళ్ళు బాగా రాణిస్తున్నారు. వారు ఎదగాలి. ఇంకా ఎదగాలని ఈ ప్యాకేజీ అందుకు సహకరిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news