చెయ్యి లాగి మరీ ఫైమాకి ముద్దు పెట్టిన నాగ్.. సీక్రెట్ చెప్పిన రేవంత్..!

-

బిగ్ బాస్ ఆరవ సీజన్ లో భాగంగా 14వ వారం జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా ఎలిమినేట్ అయింది. టాప్ ఫైవ్ లో ఉంటుందనుకున్న ఈమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ సండే ఫన్ డే లో భాగంగా హిట్ 2 చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ క్రమంలోనే ముందుగా నాగార్జున లైఫ్ లాంగ్ ఫ్రెండ్ ఎవరు ?అసలు జీవితంలో ఫ్రెండ్ గా ఎవరు వద్దు ? అనే టాస్క్ ఇచ్చాడు.. ఇందులో ముందు ఆదిరెడ్డి.. ఫైమాను ఫ్రెండు అని? ఇనయాతో ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఇనయా కీర్తిని ఫ్రెండ్ గా.. శ్రీహాన్ తో ఫ్రెండ్షిప్ డౌట్ అంటూ అతడి ఫోటోలు చించేసింది.

మరి శ్రీహన్ వంతురాగా రేవంత్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని.. ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలిసే అవకాశం ఉండదని.. అతని ఫోటోను చించేసాడు.. రోహిత్ అయితే ఫ్రెండ్ రేవంత్ అని, ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమోనని తెలిపాడు. ఫైమా.. ఆదిరెడ్డి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని , రోహిత్ తో ఎక్కువ కనెక్షన్ లేదని కూడా చెప్పింది. ఇలా ఒక్కొక్కరుగా తమకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గురించి , అలాగే తమకు నచ్చని ఫ్రెండ్ ల గురించి తెలిపారు.. అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఆఖరి ఆది రెడ్డి , ఫైమా మిగలడంతో.. ఫైమా ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు నాగార్జున.

అయితే ఫైమాకి వీడ్కోలు చెబుతూ ఒక సీక్రెట్ రివీల్ చేశాడు రేవంత్ .. ఫైమా చేతి మీద ముద్దు పెట్టనివ్వదని.. చేతి మీద ముద్దు పెడితే ఆమెకు చెక్కిలిగింతలని.. అందుకే పెట్టనివ్వదని సీక్రెట్ చెప్పేసాడు రేవంత్. దీంతో నాగార్జున ఫైమా చెయ్యి అందుకునే ప్రయత్నం చేశారు నాగ్. ఫైమా సిగ్గు పడుతూనే చేయి అందించింది. కానీ నాగార్జున ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే ఆమె చేయి వెనక్కి లాగింది. కానీ ఆమె చేతిని లాగి మరీ ముద్దు పెట్టేసారు నాగార్జున. దీంతో ఆమె రెండు చేతులతో మొహాన్ని మూసుకొని తెగ సిగ్గు పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news