Breaking : ప్రారంభమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు

-

దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఆమ్‍ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. అయితే.. భారీ పోలీసు బందోబస్తు మధ్య 250 వార్డుల్లో ఓట్ల గణన సాగుతోంది. ఈ నెల 4వతేదీన జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లు పోలయ్యాయి. 250 వార్డుల్లో 1349 మంది ఎన్నికల బరిలో నిలిచారు.ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 68 మంది ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో ఎంసీడీ ఓట్ల లెక్కింపు సాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా 136 మంది ఈసీఐఎల్ ఇంజినీర్లను నియమించారు. 42 కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాలను ప్రకటించేందుకు ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర కార్యాలయమైన నిగం భవన్ లో మీడియా సెంటరును ఏర్పాటు చేశారు.

Voter apathy? Turnouts in affluent areas lowest in Capital once again |  Latest News Delhi - Hindustan Times

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పట్టు కోసం బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య జరిగిన మెగా పోరు(AAP vs BJP) ఫలితం నేడు ఓట్ల లెక్కింపుతో వెల్లడి కానుంది.ఆప్, బీజేపీలు 250 మంది అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ 247 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. 382 మంది స్వతంత్రులు పోటీ చేశారు.ఢిల్లీని వరుసగా రెండు పర్యాయాలు పాలిస్తున్న ఆప్ మొత్తం 250 వార్డులలో 200 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ప్రకటించింది. నాలుగు ఎగ్జిట్ పోల్స్ లలో ఆప్ 155 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news