తెలంగాణాలో న్యూ ఇయర్ బ్యాన్…?

-

తెలంగాణాలో ఇప్పుడు కొత్త కరోనా ఆందోళన కలిగిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, ఐటికి హైదరాబాద్ చాలా కీలకం కావడం, ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా వచ్చే నగరం కావడంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నా సరే ఏదోక సమస్య వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలంగాణాలో ఈ కొత్త కరోనా వస్తే ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

అయితే సిఎం కేసీఆర్ ఇప్పుడు అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణాలో కరోనా తీవ్రత ఇప్పుడు అదుపులోనే ఉంది. రేపు లేదా ఆదివారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తెలంగాణాలో నూతన ఏడాది వేడుకలను బ్యాన్ చేసే అవకాశం ఉండవచ్చు అని సమాచారం. నూతన ఏడాది వేడుకల మీద నిషేధం విధించే అంశానికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లో బ్యాన్ విధించి జిల్లాల్లో అనుమతులు ఇస్తే ఎలా ఉంటుంది అనే భావనను సిఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయితే అధికారులు మాత్రం… వేగంగా గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టి… విమానాయాన సంస్థల నుంచి సమాచారం సేకరించి విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేస్తే మంచిది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై నిర్ణయం ఏంటీ అనేది త్వరలో స్పష్టత రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news