తెలంగాణ ప్రజలకు షాక్. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు లక్ష రూపాయలకు చేరువైంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో పేర్కొన్న వివరాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో తీసుకునేవి కలిపి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,57,059 కోట్లకు చేరనున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే, ఒక్కొక్కరి తలపై అప్పు రూ.98,033 కు చేరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనాల మేరకు తలసరి అప్పు రూ. 94000 కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు వేలు పెరుగుతోంది. ఇక ప్రభుత్వం పూచికత్తులు ఇచ్చి కార్పోరేషన్ల పేరిట తీసుకున్న రుణాలను కలిపితే తలసరి అప్పు మరో రూ. 30,000 వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.