కరోనా టాబ్లెట్ వచ్చేసింది, ఎప్పటి నుంచి అందుబాటులోకి…?

కరోనాకు సంబంధించి ఇప్పుడు మందులను కనుక్కునే విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు శాస్త్రవేత్తలు. వైద్య శాస్త్రానికి ఈ వ్యాధి సమస్యగా మారిన నేపధ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. అయితే ఇప్పుడు ఫైజర్ సంస్థ ఒక టాబ్లెట్ ని తయారు చేసింది. అమెరికా, బెల్జియంలోని ఫైజర్ సెంటర్స్ లో దీనికి సంబంధించి క్లీనికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు.

ఇది కచ్చితంగా కరోనాను కట్టడి చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 145 రోజులు దీనికి సంబంధించి పరిశోధనలు చేస్తారు. విజయవంతం అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాక్సిన్ తో పాటుగా దీన్ని కూడా అభివృద్ధి చేస్తే ప్రజలు కరోనా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.