బ్రేకింగ్: అందరూ వాయిదా వేస్తే మీరెలా నిర్వహిస్తారు…? పరిక్షలపై ఏపీ హైకోర్ట్

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షలు, ఇంటర్ పరిక్షలకు సంబంధించి కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. చాలా మంది విద్యార్ధులు పరిక్షలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు అని టీడీపీ అంటుంది. ఇక దీనిపై ఏపీ హైకోర్ట్ లో పిటీషన్ కూడా దాఖలు కాగా దీనిపై విచారణ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

ap high court

పరిక్షలకు సంబంధించి ప్రభుత్వం పునః పరిశీలించుకోవాలని కోర్ట్ సూచించింది. పక్క రాష్ట్రాల్లో వాయిదా వేస్తే మీరు ఎలా నిర్వహిస్తారని హైకోర్ట్ నిలదీసింది. లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలకు సంబంధించిన విషయం అని హైకోర్ట్ చెప్పగా కోవిడ్ బాదిత విద్యార్ధులకు విడిగా నిర్వహిస్తామని హైకోర్ట్ కి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మే 3 కి విచారణ వాయిదా వేసింది.