ప్రకాశం బ్యారేజ్ కి వరద ముప్పు కొనసాగుతుంది. ఎగువన భారీ వర్షాలు పడటంతో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద వస్తుంది. మొన్నటి వరకు వరద ముప్పులోనే లంక గ్రామాలు, కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధికారులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి కృష్ణా నదికి వరద వార్నింగ్ ఇచ్చింది. ప్రకాశం బ్యారేజీకి క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం అయ్యాయి.
ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.04 లక్షల క్యూసెక్కులు ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. వరద ప్రవాహం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. సురక్షిత ప్రాంతాలకు ముంపు బాధితులను తరలిస్తున్నారు.