పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి రహస్యంగా చేయడానికి కారణం..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు మూడు పెళ్లిళ్ల విషయంపై వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి కాగా ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు కానీ రెండవ భార్య రేణు దేశాయ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ వంటి సినిమాలలో నటించి ఆ తర్వాత అతనితో చాలా సంవత్సరాలు సహజీవనం చేసింది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ కొన్ని కారణాలవల్ల ఇద్దరు విడిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే మొదటి భార్య నందిని గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు డైరెక్టర్ గీతాకృష్ణ వెల్లడించారు. ముఖ్యంగా మొదటి పెళ్లి పెద్దలు రహస్యంగా చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన తెలిపారు.. గీతా కృష్ణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని మాకు బంధువు..మా అక్కను ఇచ్చింది పోలవరం అలాగే నందిని వాళ్ళది కూడా పోలవరం.. వాళ్లవి పెద్ద కుటుంబాలు.. ఆ ఊర్లో పెద్ద కుటుంబాలకి పలుకుబడి ఎక్కువగా ఉండేది. నందిని చిన్న వయసులో ఉన్నప్పుడే చూసాము. నాగార్జున సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు వర్షం కారణంగా వాళ్ళ ఇంట్లో కూర్చునే వాళ్ళము అప్పుడు అమ్మాయిని చిన్ని అని పిలిచే వాళ్ళం అంటూ తెలిపారు గీతాకృష్ణ.

అమ్మాయిని మరోసారి కూడా చూశాను కానీ పెళ్ళి జరిగినప్పుడు నాకు తెలియదు.. ముంబైలో ఉండగా మళ్లీ వాళ్ళ పెళ్లి అయ్యాక ఒకసారి నందిని వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కలిసి ఆల్బమ్ చూపించారు. పెళ్లి వాళ్లు గ్రాండ్గా చేయాలని అనుకున్నా.. పవన్ ఒప్పుకోకపోవడం వల్లే చివరి నిమిషంలో షిరిడీలో సింపుల్ గా ఎవరికీ చెప్పకుండా చేశారు అంటూ తెలిపారు. ఇకపోతే వీరిద్దరూ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల విడిపోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version