వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెన్షన్ రికవరీలు ఆపండంటూ ఉత్తర్వులు జారీ

-

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ దెబ్బకి వెనక్కి తగ్గింది. పెన్షన్ రికవరీలు ఆపండంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రికవరీ నోటీసులపై ప్రభుత్వం అధికారులకు స్పష్టతనిచ్చింది. అనర్హులకు లబ్ది, రికవరీపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించినట్లు సీఎస్ శాంతి కుమార్ తెలిపారు. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ది పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ,అర్హులకే లబ్ది అందేలా త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తాం అని తెలిపారు. మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దు అని ఉత్తర్వుల్లో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు.

 

కాగా, వృద్ధులకు అండగా నిలిచేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం అందజేసిన ఆసరా పింఛన్లను వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. రెండేసి పింఛన్లు తీసుకుంటున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి 1,826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసినట్టు ప్రకటించింది. పింఛన్లు తొలగించనున్న 1,826 మంది జాబితాను ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలకు పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news