పున్నామ నరకం నుండి రక్షించే వాడినే పుత్రుడు అంటారు.కానీ ఆ పుత్రుడే కాలయముడు అయ్యాడు. కేరళలోని త్రిస్సూర్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.తల్లిదండ్రులను నడి రోడ్డుమీదే కిరాతకంగా నరికి చంపేశాడు ఓ వ్యక్తి.కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు పోలీసులు.ఈ దారుణ ఘటన కేరళలోని త్రిస్సూర్ లో వెలుగుచూసింది.
ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆ యువకుడి తల్లిదండ్రులు రోడ్డు సమీపంలో పని చేసుకుంటూ ఉండగా వచ్చిన నిందితుడు..వెంట తీసుకు వచ్చిన కత్తితో వారిని పొడిచి చంపేశాడు.అనంతరం తాను హత్య చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందించి అక్కడి నుండి పరారయ్యాడు నిందితుడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నిందితుడు అనీష్(30) సహా మృతులు కుట్టన్ (60) చంద్రిక (55) ఇంఛ్హాకుండ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులులు తెలిపారు.పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.