రాష్ట్రంలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి…కరీంనగర్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈరోజు ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అవ్వనుంది.
మొత్తం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా స్థానిక సంస్థలకు చెందిన 5,326 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘనలు చోటు చేసుకోకుండా భారీ బందబస్తును ఏర్పాటు చేశారు. ఇక గతం లో కంటే ఈ ఏడాది ఏకగ్రీవాల కోసం విఫల యత్నాలు చేశారు. కొన్ని స్థానాలు ఏకగ్రీవం అవ్వగా మరి కొన్ని స్థానాల్లో అభ్యర్థులు తగ్గలేదు. అంతే కాకుండా క్యాంపు రాజకీయాలు కూడా జోరుగా జరిగాయి.