జగన్ కి వస్తున్న ఆదరణ చూడలేకే దాడి : పేర్ని నాని

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి వస్తున్న ఆదరణ చూడలేక ఆయనపై టీడీపీ దాడి చేయించిందని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ర్యాలీలో నేనూ ఆయన పాటే ఉన్నా.. జనంలో జగన్ కి విపరీతమైన క్రేజ్ ను చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. గాయానికి రెండు కుట్లు పడే అవకాశముంది. ఓ వైపు కళ్లు బైర్లు కమ్మినా మళ్లీ యాత్రను జగన్ కొనసాగిస్తున్నారు. శత్రువులు ఏం చేసినా కూడా సంకల్పాన్ని ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు పేర్ని నాని.

విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన ఘటన పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి జరిగిన సరఫరాలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కలకలం రేపేతోంది. ఆ రూట్ లో పలుమార్లు విద్యుత్ కి అంతరాయం కలగడంతో ఉద్దేశపూర్వకంగా దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన చోట ఓ వైపు స్కూల్, మరోవైపు భవనాలున్నాయి. పాఠశాల భవనం పక్క నుంచి రాయి వచ్చినట్టు అనుమానిస్తున్న పోలీసులు సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news