ఏపీ సీఎం వై.ఎస్.జగన్ పై ఓ గుర్తు తెలియని అగంతకుడు రాయితో దాడికి పాల్పడ్డాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి విజయవాడలో బస్సు యాత్ర చేస్తుండగా.. జగన్ పై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి గాయం తగిలింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై దాడి ఘటనపై మంత్రి గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటన అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు.
సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో జగన్ పై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని హితవు పలికారు. ముగ్గురం కలిసినా జగన్ ను ఏమీ చేయలేకపోతున్నామని చివరికి ఇలా దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ కూటమిపై మండిపడ్డారు. పార్టీ అధినేత జగన్పై దాడి జరిగిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇలాంటి ఘటనలను ఎదుర్కొందామని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్పై రాళ్ల దాడి చంద్రబాబు చేసిన కుట్రేనని.. ఎన్నికల్లో బాబుకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు.