గేమ్ ఛేంజర్ మూవీ పై కీలక అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

-

రామ్ చరణ్  మరో అరుదైన గౌరవం అందుకున్నారు.చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కి డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ…’గేమ్ ఛేంజర్’ విడుదలపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్లో సినిమా విడుదల చేస్తామని అన్నారు. మొత్తం 5భాషల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని అన్నారు.

కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.కాగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కియారా హీరోయిన్గా సందడి చేయనున్నారు.దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించినటువంటి పొలిటికల్, డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news