ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సుప్రీం కోర్టులో హత్రాస్ ఘటనపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే హత్రాస్ ఘటన కేసులోని సాక్షులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తుంది అంటూ అని యూపీ సర్కార్ ను సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా బాధిత కుటుంబం న్యాయవాదిని ఏర్పాటు చేసుకుందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకుంది.
దీనికి సంబంధించి బుధవారం లోగా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ యూపీ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే అంతకు ముందు ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని దీనిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.