ఉరి శిక్ష వాయిదా కోసం జైలు గదిలో చేస్తున్న ట్రిక్కులు తెలిస్తే…!

-

నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటిన ఉరి శిక్షను అమలు చేయనున్నారు అధికారులు. వారు ఉన్న తీహార్ జైల్లోనే అధికారులు శిక్షను ఉదయ౦ ఆరు గంటలకు అమలు చేయనున్నారు. ఇప్పటికే అన్ని సిద్దం చేసిన అధికారులు, ఇసుక బస్తాలతో ట్రయల్స్ కూడా పూర్తి చేసారు. అయితే నిందితులు మాత్రం రివ్యూ పిటిషన్, క్యురేటివ్, మెర్సీ పిటిషన్లంటూ రాష్ట్రపతి, సుప్రీం కోర్ట్ చుట్టూ తిప్పుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అన్ని మార్గాలు అయిపోతే ఉరి శిక్షను ఏ విధంగా తప్పించుకోవాలా అనే దాని మీద ఖైదీలు ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఉండే బ్యారేక్ వద్ద అధికారులు పూర్తి స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34), అక్షయ్ (31)ని 6*8 అడుగులున్న వేర్వేరు గదుల్లో ఉంచారు అధికారులు.

ఆరు రోజులు మాత్రమే ఉన్న నేపధ్య౦లో వారు శిక్ష నుంచి తప్పించుకోవడానికి తలను గోడకు వేసి కొట్టుకోవడం, బాత్ రూమ్ లో బకెట్ తో గాయపరుచుకోవడం,గదిలో మేకులు, రాడ్లతో దాడి చేసుకునే ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో వాళ్ళు ఉండే జైలు బ్యారేక్ లో ఆ సదుపాయాలు లేకుండా చేసారు అధికారులు. వాళ్ళను నిత్యం గార్డులు కనిపెడుతూ ఉంటున్నారు.

ఒక్కళ్ళు గాయపడినా సరే ఉరి నలుగురికి వాయిదా పడే అవకాశం ఉంది. దీనితో ఏ విధమైన సంఘటనలు జరగకుండా నిత్యం సీసి కెమెరాలతో వాళ్ళను గమనిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామ్‌సింగ్ మార్చి 11, 2013లో జైలు గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ విధంగా ఏదీ జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే వారు ఆహారం తినే సమాయంలో కూడా గార్డులు ఉంటున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news