నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టారని..అధికారంలోకి రాగానే వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గ్రూప్ 1మెయిన్స్‌కు 1:100…. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 ఎల్జిబిలిటీ పరిగణించాలని విజ్ఞప్తి చేశారు . కానీ ఇప్పుడు వారికి అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదు అని హరీష్ రావు ప్రశ్నించారు.
25వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 11 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తుంది ఆయన మండిపడ్డారు.అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, 6 నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం విద్యార్థులను మోసం చేయడమే అన్నారు.