కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం స్పష్టత.. అప్పుడే వస్తుంది..?

-

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోన్న నేపథ్యంలో వివిధ దేశాలలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇక భారత్లో కూడా పలు ఫార్మా సంస్థలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి ప్రస్తుతం శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని దేశ ప్రజానీకం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వటం చూస్తుంటే వ్యాక్సిన్ వస్తే కాని పరిస్థితి అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్… కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఒకటి కంటే ఎక్కువ సంస్థలు ఈ కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకు వస్తాయి అంటూ తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు హర్షవర్ధన్… దేశ జనాభా దృష్ట్యా అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా ప్రస్తుతం తమ బృందాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రజలందరికీ తీపికబురు లాంటివి అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news