కుక్కకు బెలూన్ కట్టి గాల్లోకి వదిలాడు… చివరికి…!

ఢిల్లీకి చెందిన యూట్యూబర్ ఇటీవల తన పెంపుడు కుక్కను హైడ్రోజన్ బెలూన్లతో కట్టి గాల్లోకి వదిలిన వీడియో వైరల్ ఇప్పుడు సంచలనం అయింది. అయితే సరదాగా చేసిన ఆ పని ఇప్పుడు అతన్ని జైలు పాలు చేసింది. నిందితుడు గౌరవ్ జాన్ తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక వీడియో చేసాడు. అందులో అతను తన పెంపుడు కుక్కతో ఢిల్లీలోని ఒక పార్కులో కనిపించాడు.

వీడియోలో, యూట్యూబర్ తో పాటు అతని తల్లి కూడా ఉన్నారు. వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయగా అది జంతు హక్కుల సంస్థల వద్దకు చేరుకుంది. వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తర్వాత తొలగించారు. పీపుల్ ఫర్ యానిమల్ (పిఎఫ్‌ఎ) సభ్యులు ఈ వీడియోను కనుగొని అతనిపై ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌లో గౌరవ్ జాన్‌పై ఫిర్యాదు చేశారు