స్విగ్గీకే దారి చూపిస్తున్న మహిళ… ఎన్నో సవాళ్ల తర్వాత ఆ స్థానం

-

ఇంట్లో ఉండే కావాల్సినవి ఆర్డర్ పెట్టుకుని తినే రోజులివి.. మీరు ఏమూలనా ఉన్నా.. గూగుల్ మిమ్మల్ని వెతికి పట్టుకుని మరీ మీరు అడిగింది తెస్తుంది. ఫుడ్ డెలివరీ చేసే వాళ్లు కరెక్టుగా టైం అంటే టైంకే వచ్చేస్తారు. ఎప్పుడో ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందనుకోండి. మనం ఆర్డర్ చేసిన వెంటనే లోకేషన్ ఆధారంగా డెలివరీ బాయ్స్ వస్తారు. మరీ ఆ లోకేషన్ సెట్ చేసింది ఎవరూ..మనం చేసే చిన్న పని వెనుక పెద్ద కథే నడుస్తుంది. క్లిక్ మనిపించడంతో మన పని అయిపోతుంది కానీ.. అక్కడినుంచే ఎంతో మంది వర్క్ స్టాట్ అ‌వుతుంది. ఇంత పెద్ద సంస్థకు మ్యాప్ లు రూపొందిస్తుంది ఓ మహిళ. స్విగ్గీకే దారిచూపిస్తున్న ప్రజ్ఞ గురించి ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిందే..
మహిళలకు సాధ్యం కానిదే ఏదీ లేదని ఎప్పడూ స్త్రీవాదులు చెప్తుంటారు. వాటిని నిజం చేసి చూపించే.. మహరాణులు ఎంతో మంది. టెక్నాలజీ రంగంలో.. కొత్త కొత్త సాంకేతికలతో.. ఓ సంస్థలో కీలకమైన బాధ్యత వహిస్తున్న ప్రజ్ఞ కథ ఎంతో మందికి మోటివేషన్ అవుతుంది. సేవల్ని మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఫుడ్‌ డెలివరీ సమయాన్ని తగ్గించడానికి కొత్తమార్గాల్ని అన్వేషిస్తుంటుంది స్విగ్గీ. అందుకోసం కచ్చితమైన మ్యాప్‌లను అభివృద్ధి చేసుకోవాలని గ్రహించి.. ప్రజ్ఞా కర్బారిని సంప్రదించింది. మూడేళ్ల కిందట ఆ బాధ్యతల్ని స్వీకరించిన ప్రజ్ఞ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అక్కడవరకూ చేరడానికి ఆమె కెరియర్‌లో ఎన్నో మలుపులూ, సవాళ్లను అధిగమించిందట..
ప్రజ్ఞ పుట్టి పెరిగింది ముంబయిలో… పై చదువుల కోసం 1998లో అమెరికా వెళ్లి అట్లాంటాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఎం.ఎస్‌., పీహెచ్‌డీ చేసింది.. ఆ క్రమంలోనే కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌పై పరిశోధనలు చేసింది ప్రజ్ఞ. ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు మూలమిది. పీహెచ్‌డీ పూర్తవగానే అమెరికాలోనే గూగుల్‌లో చేరారు ప్రజ్ఞ. డేటా నిల్వచేసే కేంద్రం, పంపిణీ కేంద్రాల మధ్య లోడ్‌ బ్యాలెన్సింగ్‌ను గమనిస్తూ అవి సజావుగా పనిచేసేలా చూడటం ఈమె బాధ్యత.
తన చొరవ చూసి స్వల్ప వ్యవధిలోనే గూగుల్‌ సర్వర్లని చూసే బాధ్యతనీ సైతం ప్రజ్ఞకు అప్పగించారు. ‘ఇదో సవాల్లాంటిది. అప్పట్లో సర్చ్‌, యాడ్స్‌, జీమెయిల్‌… ఇవన్నీ ఆ సర్వర్‌ ద్వారానే నడిచేవి. 2009లో బెంగళూరు గూగుల్‌ శాఖకు మారి ఆర్కుట్‌, ప్రాంతీయ భాషల్లో సర్చింగ్‌, మ్యాప్స్‌ మొదలైనవాటిపైన పనిచేశారు. ఈ సేవలకు ‘గూగుల్‌ ఫౌండర్స్‌ అవార్డు’(2010) అందుకున్నారు.
స్టాట్ అప్స్ విప్లవం మొదలయ్యాక వ్యాపారవేత్తగా మారాలనుకుని 2014లో గూగుల్‌ నుంచి బయటకు వచ్చేశారు ప్రజ్ఞ. ఆమె భర్త చెన్నైలో ఉండేవారు. ఆగ్మెంటెండ్‌ రియాలిటీ విభాగాన్ని ఎంచుకుని గూగుల్‌లో పనిచేసిన మిత్రుడు సహ వ్యవస్థాపకుడిగా చెన్నైలోనే ‘పాయింట్‌105-ఏఆర్‌’ను మొదలుపెట్టారు. యాప్‌నీ తెచ్చారు. ‘ఇంజినీర్‌గా ఉద్యోగం చేయడానికి, సొంతంగా వ్యాపారం చేయడానికి చాలా తేడాలున్నాయి. మంచి ఉత్పత్తే కానీ, మార్కెట్‌ని సృష్టించుకోలేకపోయారట.. మూడేళ్లపాటు(2019) యాప్‌ను నడిపాక కూడా ఆపేయడం మంచిదని నిర్ణయించుకున్నారు. అప్పుడే స్విగ్గీ నుంచి పిలుపు వచ్చింది. హైపర్‌ లోకల్‌ మ్యాప్‌లు తయారుచేయాలన్నది వారి ప్రతిపాదన. చెన్నైలోనే ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటుచేసి, నాయకత్వ బాధ్యతలు తీసుకోమన్నారు. మంచి అవకాశంగా అనిపించి అందులో జాయిన్ అయ్యింది.
స్వయానా వినియోగదారుడికీ, డెలివరీబాయ్‌కీ ఎదురయ్యే ఇబ్బందుల్ని గమనించడానికి గ్రౌండ్ లెవల్ కి వెళ్లి..మ్యాపింగ్‌లో మార్పులు తెచ్చారు ప్రజ్ఞ. నగరాల్ని జోన్లుగా విభజించి, వాటిలోని వీధుల్ని, అపార్ట్‌మెంట్లనీ, ఇళ్లనీ మ్యాపింగ్ ‌చేశారు. కచ్చితత్వం కోసం జీపీఎస్‌, ఇతర సాంకేతికతల్ని వాడారు.. దీనికోసం ‘లొకేషన్‌ ఇంటెలిజెన్స్‌’ వ్యవస్థను నెలకొల్పినట్లు ప్రజ్ఞ తెలిపారు.. డెలివరీ బాయ్‌ అపార్ట్‌మెంట్‌కి చేరడం వరకే కాదు, ఆపైన బైక్‌ ఎక్కడ పార్క్‌ చేయాలి. అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లడానికి లిఫ్ట్‌కి ఎలా వెళ్తే దగ్గరవుతుంది… లాంటివీ మ్యాప్‌లో ఉంటాయి. దీనివల్ల వారి పని వేగంగా, తేలిగ్గా అయిపోతుంది.
ఇలా కెరీర్ లో.. సవాళ్లను ఎదుర్కోని.. మొత్తానికి ఇప్పుడు ఓ పెద్ద సంస్థలో కీలకమైన బాధ్యతలు వహిస్తుంది ప్రజ్ఞ. ఓ మహిళగా ఆమె ఈ స్థాయికి రావడం అనేది గొప్ప విషయం. చదువుకునే రోజుల నుంచే ఎంచుకునే సబ్జెట్ లో మార్పులు వస్తే.. మన కెరీర్ భిన్నంగా ఉంటుంది. ఎప్పూడూ అందరూ వెళ్లే దారిలోనే వెళ్తే మనకు గుర్తింపు రావొచ్చు.. రాకపోవచ్చు. అరే ఈ ఫిల్డ్ లో అమ్మాయిలు ఉండరు అని చాలా మంది తమకు నచ్చినా సరే.. ఎంచుకోరు. అలా కాకుండా.. పూర్తి ధైర్యంతో.. మనకు ఆ కోర్సు ఇష్టమైతే.. నీతోనే ఎందుకు మొదలుపెట్టకూడదు.?

Read more RELATED
Recommended to you

Latest news