హైదరాబాద్ లోని పాతబస్తీలో గల జాంబాగ్ లో గల పట్ణణ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం లో చోరీ జరిగింది. ఈ చోరీలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ దొంగలు వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. మొత్తం మూడు కంప్యూటర్లు, 340 డోసుల కొవాగ్జిన, 270 డోసుల కొవిషీల్డ్ టీకాలను చోరీకి గురి అయ్యాయి. అంతే కాకుండా ఆస్పత్రిలో గోడకు ఉన్న టీవీని దొంగలించాలిని ప్రయత్నం చేశారు. అయితే అది పగిలిపోయింది. ఈ ఘటన పై మెడికల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగ చోరీ ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారు జామున జాంబాగ్ పట్టణ ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో జరిగినట్టు తెలుస్తుంది. సోమవారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది వచ్చి చూసే సరికి మూడు కంప్యూటర్లు కనిపించలేదు. అలాగే వ్యాక్సిన్లను చూస్తే.. వాటిలో కూడా కొన్ని మిస్ అయినట్టు గుర్తించారు. అలాగే టీవీ కూడా పగిలిపోయింది. దీంతో ఆస్పత్రిలో దొంగతనం జరిగిందని పై అధికారులకు తెలిపారు. దీంతో వైద్య అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగ ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అలాగే దర్యాప్తు చేస్తున్నారు.