విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఇచ్చిన ఫ్యాకేజీ పై అనుమానాలున్నాయి : బొత్స సత్యనారాయణ

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజైపై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నాయని ఆరోపించారు. ప్రయివేటీకరణ వ్యూహం అమలులో భాగంగానే ప్యాకేజ్ అనేది కచ్చితంగా చెబుతున్నాం.. అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఇస్తే పరిశ్రమ ఏ విధంగా నడుస్తుంది..? అని ప్రశ్నించారు. కార్యచరణ ప్రకటించకుండా ప్యాకేజ్ ప్రకటించడం వెనుక మతలబు ఉందని
అన్నారు. ప్యాకేజ్ అనేది ప్రలోభ పెట్టడమే తప్ప ప్రయోజనం చేకూర్చేది కాదని తెలిపారు.

ప్రయివేటీకరణ ఆలోచన కేంద్రానికి లేకపోతే ప్రధాని సభలో కానీ అమిత్ షా టూర్ లో ఎందుకు చెప్పలేదని ఎమ్మెల్సీ బొత్ససత్యనారాయణ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అడ్డుపడటం వల్లే ప్రయివేటీకరణకు కేంద్రం సాహసం చేయలేదని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు
వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పోరాటం చేస్తాం.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉండాలనేది తమ విధానం అందుకోసం తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దివాళా తీసే స్థితిలో ఉన్న పరిశ్రమకు ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా ఎటువంటి మేలు జరగదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆర్భాటం, ప్రచార యావ తప్ప ప్రజారక్షణ పై బాధ్యత లేదనేది అర్ధం అవుతూందని పేర్కొన్నారు. ట్రంప్ ఆసక్తి.. సలహాదారులతో చర్చ.. తిరుపతి ఘటనపై కేంద్రం విచారణ జరక్కుండా అడ్డుకుని
పరువు కాపాడుకున్నామని ప్రభుత్వం భావిస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news