కొచ్చి విమానశ్రయంలో ఓ వ్యక్తి అబద్దం చెప్పి అక్కడ ఉన్న వారందరినీ భయబ్రాంతులకు గురి చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రయాణికుడు మనోజ్ కుమార్. ఎయిరిండియా విమానంలో కొచ్చి నుంచి ముంబయికి వెళ్లాల్సి ఉంది. అయితే ఎక్స్ రే బ్యాగేజీ ఇన్ స్పెక్షన్ చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేస్తున్నప్పుడు మనోజ్ సీఐఎస్ఎఫ్ అధికారితో నా బ్యాగ్ లో బాంబు ఉందా..? అని ప్రశ్నించాడు.
వెంటనే సెక్యూరిటీ సిబ్బంది టెన్షన్ పెంచేసి.. కొచ్చి విమానాశ్రయం ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే అధికారులు ఫారన్ బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ ని పిలిచారు. అతని లగేజీని తనిఖీ చేయగా అందులో ఏమి లేదు. దీంతో విమానాశ్రయం పోలీసులు మనోజ్ ని లోకల్ పోలీసులకు అప్పగించారు. ఇక షెడ్యూల్ ప్రకారమే ఎయిర్ ఇండియా విమానం బయలు దేరింది. కానీ మనోజ్ మాత్రం పోలీస్ స్టేషన్ కి బయలుదేరాల్సి వచ్చింది. చిన్న అబద్దం అతని అరెస్ట్ వరకు వెళ్లింది. దయచేసి ఇంకా ఎవ్వరూ ఇలాంటి ప్రకటనలు చేయకండి మిత్రమా..!