భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా అధిక దిగుబడిని ఇచ్చే, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కునే 109 కొత్త బయోఫోర్టిపైడ్ పంట రకాలను ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా మిల్లెట్లు, పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్, పత్తి, చెరకు వంటి తదితర వెరైటీ పంటల రకాలు ఉన్నాయి.
న్యూ ఢిల్లీలోని ఇండియా అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సైంటిస్టులు, రైతులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ గురించి ఆరా తీశారు. ఎలాంటి మందులు లేకుండా కలుషితం కాకుండా ఫుడ్ ని పండించే మార్గాలను కనుక్కొన్నారు ప్రధాని మోడీ. కృషి విజ్ఞాన కేంద్రాలు నిర్వహిస్తున్న పాత్రను కూడా రైతులు కొనియాడారు. కేవీకేలు రైతులకు వాటి ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి నెలా అభివృద్ధి చేస్తున్న కొత్త రకాల ప్రయోజనాల గురించి రైతులకు ముందుగానే తెలియజేయాలని ప్రధాన మంత్రి సూచించారు.