చిరంజీవి, వెంకటేశ్ మధ్య రెండు సార్లు వెరీ బిగ్ ఫైట్..ఎవరు నెగ్గారంటే?

-

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ మధ్య ఎంత చక్కటి అనుంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, సినిమాల విషయంలో మాత్రం ఆరోగ్యకరమైన పోటీ ఉందండోయ్.. వీరిరువురి సినిమాలు అప్పట్లో అనగా 1991,92 ప్రాంతాల్లో వరుసగా పోటీ పడ్డాయి. ఆ బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరి ఫిల్మ్స్ సక్సెస్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ బాపినీడు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ఫిల్మ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఇందులో చిరంజీవి నటనతో పాటు డ్యాన్స్, ఫైట్స్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేశాయి. చిరు..ఇటువంటి సినిమాలు చేయాలని అభిమానులు కోరుకున్నారు కూడా. అలా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీని వెంకటేశ్ సినిమా బీట్ చేయడం గమనార్హం.

‘బొబ్బిలి రాజా’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత వెంకటేశ్ చేసిన క్లాసికల్ ఫిల్మ్ ‘చంటి’. ఈ మూవీ విడుదలై చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ రికార్డులన్నిటినీ క్రాస్ చేసి..ఫ్యామిలీ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. ముఖ్యంగా ఇందులో వెంకటేశ్ అమాయక నటన, జమీందారుగా నాజర్ పాత్ర, ఆయన కూతురిగా మీనా నటన ప్రేక్షకులకు విశేషంగా నచ్చాయి. అయితే, ‘చంటి’ సినిమా రికార్డులన్నిటినీ ఆ తర్వాత సినిమా ‘ఘరానా మొగుడు’తో మెగాస్టార్ చిరంజీవి బీట్ చేయడం విశేషం. అలా వెంకటేశ్, చిరంజీవి మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆ ఏడాది రసవత్తరంగా సాగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version