ఆ రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు : మంత్రి పొంగులేటి

-

రైతును రాజును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.ఇవాళ వనపర్తిలో నిర్వహించిన పంట పెట్టుబడి పథకం రైతు భరోసాపై నిర్వహించిన సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు,తుమ్మల నాగేశ్వర రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తో కలసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గతంలో 4 గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకుకున్నారని విమర్శించారు.కొండలు, గుట్టలు, భూస్వాములు, లేఔట్, ఫాంహౌస్ లకు రైతుబంధు పెట్టుబడిని ఇచ్చారని ఆయన ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల మధ్యకు పోయి వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. 10 ఎకరాల వారికి, ఐటీ రిటర్న్, ఐటీ చెల్లించే వారికి ఇవ్వరని ప్రతిపక్షాలు రైతులను భయపెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి అన్నారు. రైతులు, కౌలు రైతులు ఇలా అందరి దగ్గర అన్ని రకాల సూచనలు తీసుకుని రైతులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. రైతు భరోసా పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల, రైతు సంఘాల నుంచి మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాపయాలు సేకరిస్తుందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news