కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో అనవసరంగా గొడవకు దిగుతోందని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఫైర్ అయ్యారు. ఈ ధోరణి వల్ల ప్రయోజనాలు శూన్యమని అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వం తనపై నమ్మకం ఉంచిందని, వారి అంచనాలకు తగినట్టు పని చేయాలని భావిస్తున్నట్టుఆయన తెలిపారు. అయితే, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో అనవసరంగా వివాదం దిశగా కొనసాగుతోంది. కేంద్రం ప్రభుత్వంపై బురద చల్లడం వల్ల ప్రయోజనం ఉండదు, చర్చించేందుకు రావాలని అభ్యర్థిస్తున్నట్టు తెలిపారు.
పరస్పర సహకారంతో రాష్ట్ర ప్రయోజనాలు పొందవచ్చు. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు కేంద్రంపై బహిరంగంగా విమర్శలు చేస్తూ, అనవసరంగా చిక్కులు సృష్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి.కర్ణాటకకే తన ప్రాధాన్యత ఉంటుందని, అయితే దేశం మొత్తం కేంద్ర మంత్రిగా దృష్టి సారించాల్సి ఉందని అన్నారు.ఇదే సమయంలో ప్రధాని తనకు ఉక్కు, భారీ పరిశ్రమలు వంటి రెండు సున్నితమైన శాఖలను అప్పగించారు.ఇక వాటిపై అధ్యయనానికే కనీసం 3 నెలల సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం తొలిసారి అని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలిపారు.