అక్క‌డ యాంటి వ్యాక్సినేష‌న్ ఉద్యమం

-

ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ గ‌డ వ‌ణికించిన క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కు వ్యాక్సిన్ లు క‌నుగోన్నారు. చాలా దేశాల‌లో ప్ర‌తి ఒక్క‌రు కూడా వ్యాక్సిన్ వేసు కోవాల‌ని ఆర‌ట ప‌డుతున్నారు. కానీ ఆస్ట్రేలియా దేశంలో తాము వ్యాక్సిన్ వేసుకోమ‌ని.. ప్ర‌భుత్వం త‌మ ను వ్యాక్సిన్ వేసుకోమ్మ‌ని ఇబ్బంద‌లు పెట్ట వ‌ద్ద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రి కి వ్యాక్సిన్ త‌ప్ప‌ని స‌రి చేసింది. అయితే ఈ నిర్ణ‌యాన్ని ఆస్ట్రేలియా లో కొంత మంది ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

వైర‌స్ పేరు తో త‌మ స్వేచ్ఛ‌ను ప్ర‌భుత్వం హ‌రిస్తుంద‌ని మండి ప‌డుతున్నారు. త‌మ‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేదంటు యాంటి వ్యాక్సినేష‌న్ ఉద్య‌మానికి తెర లేపారు. ఈ యాంటి వ్యాక్సినేష‌న్ ఉద్య‌మంతో ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్, సిడ్నీ, పెర్త్, బ్రిస్బేన్ తో పాటు మ‌రి కొన్ని న‌గ‌రాల్లో ఉధృతంగా సాగుతుంది. కాగ కొద్ది రోజుల క్రితం కెన‌డా దేశంలో కూడా యాంటి వ్యాక్సినేష‌న్ ఉద్య‌మం జ‌రిగింది. అంతే కాకుండా కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిస్ ట్రూడో పై ఉద్య‌మ‌కారులు రాళ్ల దాడి కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news