చిన్నారుల కోసం బంగారం లాంటి నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ పోలీసులు…!

కోవిడ్ బారిన పడిన తల్లి దండ్రుల కారణంగా నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకు సైబరాబాద్ పోలీసుల తోడ్పాటు అందిస్తున్నారు. తల్లి తండ్రి ఇద్దరు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న పోలీసులు… పిల్లల సంరక్షణ కొరకు డే కేర్ సెంటర్ లను చైల్డ్ కేర్ సెంటర్ గా మారుస్తూ చిన్నారులకు చేయూత అందిస్తున్నారు. తిరిగి తల్లి తండ్రి లకు కోవిడ్ నెగిటివ్ వచ్చే వరకు చైల్డ్ కేర్ లో పిల్లలను ఉంచవచ్చు అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

చైల్డ్ కేర్ లో ఉంటున్న పిల్లల పట్ల అన్ని జాగ్రతలు తీసుకుంటాం అని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి రోజు సానిటైజ్ చేస్తామని కూడా తెలిపారు. అటువంటి వారికోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసామని ఆయన వివరించారు. వెంటనే 080 – 45811215 కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.