ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే కంపెనీలు ఇవే..!

-

మీరు మీ దగ్గర ఉన్న డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ఆలోచనలో ఉన్నారా. ఇక ఎక్కువ వడ్డీ పొందాలి అనుకుంటున్నారా. అయితే ఇకు ఏ కంపెనీలు ఎక్కువ వడ్డీలు ఇస్తున్నాయో తెలియదా..? అయితే ఈ వార్త మీకోసమే. ఇక దీర్ఘకాలం, స్వల్పకాలమనే తేడా లేకుండా అత్యుత్తమ వడ్డీరేట్లను బ్యాంకులు అందిస్తుండటంతో చాలా మంది వీటిలో పొదుపు చేస్తున్నారు. అయితే దేశంలోని చాలా కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ప్రస్తుత వడ్డీ రేటు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ వడ్డీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

cash
cash

అయితే పెట్టుబడి పెట్టడానికి ముందు కంపెనీ ఎఫ్డీల్లో వచ్చే నష్టాలను అర్థం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. అంతేకాదు పెట్టుబడిదారులను ఫైనాన్షియల్ ప్లానర్స్ హెచ్చరిస్తున్నారు. ఇకపోతే పీఎన్‌బీ హౌసింగ్, సుందరం హౌసింగ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్, ఎల్ఐసీ హోం ఫైనాన్స్ సంస్థలకు ఇష్యూవర్లు రేటింగ్ ఇవ్వలేదు. అంతేకాదు మిగిలిన వాటికి రేటింగ్ పొందుపరిచారు. శ్రీరాం ట్రాన్స్ పోర్టు కంపెనీ 0.40 శాతం, సుందరం హోం ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్ సంస్థలు 0.50 శాతం అదనపు వడ్డీని వయోధికులకు ఇస్తున్నాయి.

ఇక కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా కార్పోరేట్ ఎఫ్డీలు ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే ఇవి స్థిరమైన రాబడిని అందిస్తాయి. ఎఫ్డీలపై బ్యాంకులిచ్చే దానికంటే కొంచెం ఎక్కువ రిటర్నులను అందిస్తాయి. అయితే ఇదే సమయంలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా ఎఫ్డీల మాదిరిగానే కార్పోరేట్ ఎప్డీలపై వడ్డీ చెల్లింపు.. మీ ఆదాయపు పన్ను స్లాబ్ రేటుకు పూర్తిగా విధిస్తారు. కాబట్టి ఇది పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ కారకంగా పనిచేస్తుంది. అంతేకాదు కార్పోరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే హై రేటింగ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ఇక సకాలంలో చెల్లింపు, భద్రతా స్థాయి బలంగా ఉందని ఏఏ రేటింగ్ ను సూచిస్తుంది. అధిక రేటింగ్ జారీ చేసేవారి మంచి సామర్థ్యంతో పాటు అలాగే అకాల విముక్తి నిబంధనలు కఠినంగా లేవని నిర్ధారించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news