ప్రపంచంలో కాస్ట్లీ హోటల్స్ ఇవే.. ఒక్కరాత్రి ఉండాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

-

ఖరీదైన హోటళ్లలో ఉండటానికి చాలామందికి ఇష్టం ఉంటుంది. ఆ హోటళ్లలో ఉండే సౌకర్యాలు, ఆ అరేంజ్ మెంట్స్ అన్నీ బాగుంటాయి. ఒక మధ్యతరగతి కుటుంబంలో వారికి..ఖరీదైన హోటళ్లలో ఒక రోజైనా ఉండాలనేది కలగా చాలామందికి ఉంటుంది. కాస్త రిచ్ అయితే..ఉండటానికి పెద్దగా ఆలోచించరు. ఒక రాత్రికి 5నుంచి 10వేలు పెట్టడం అనేది వారికి పెద్ద మ్యాటర్ కాదు. కానీ లక్షలు పెట్టాలంటే..ఎంత డబ్బున్నవారైనా కాస్త ఆలోచిస్తారు. ఒక రోజు అంతా ఆ హోటల్ లో ఉండాలంటే..50లక్షలు పెట్టాలంట. ఇక మనలాంటివారు అయితే ఆస్తులు అమ్ముకోవాల్సిందేగా..ఎంత డబ్బున్నవారైనా అంత ఖర్చు పెట్టి ఉంటారా అసలు.అందుకే దీనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ గా పేరుంది. దీనితోపాటు..ఇండియాలో అత్యంత ఖరీదైన హోటళ్ గురించి కూడా చూద్దాం.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్ :

ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్ The Empathy Suite, Palms Casino Resort. ఇది అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఉంది. ఇక్కడ ఒక రోజు బస చేస్తే ధర సుమారు 1 లక్ష డాలర్లు పెట్టాల్సిందే..అంటే భారతీయ కరెన్సీని పరిశీలిస్తే 70 లక్షల రూపాయలకు పైమాటే అమనాట.. అంటే ఇక్కడ ఒక్కరోజు ఉండాలంటే 70 లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే.

24 గంటలపాటు క్యాసినో సదుపాయాన్ని అందిస్తారు. దాని ప్రత్యేక ఆకృతి ప్రజలను దాని వైపు ఆకర్షిస్తుంది. దీనిని ప్రసిద్ధ బ్రిటిష్ కళాకారుడు రూపొందించారట. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్, మసాజ్ టేబుల్, రిలాక్సేషన్ రూమ్, జాకుజీ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీని కారణంగా ఈ హోటల్ ప్రత్యేకంగా పరిగణిస్తారు. అందుకే ఇందులో ఉండటానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు.

భారతదేశంలో అత్యంత ఖరీదైన హోటల్ :

ఇండియాలో ఖరీదైన హోటల్ అంటే జైపూర్‌లో ఉంది. దాని పేరు రాంబాగ్ ప్యాలెస్. ఇందులో ఒక ప్రత్యేక గది ఉంది. ఇందులో బస చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. ఈ హోటల్‌లో అనేక రకాల గదులు అందుబాటులో ఉన్నాయి. హోటల్‌లో సుఖ్ నివాస్ అనే ప్రత్యేక గది ఉంటుంది. దీనివల్లే ఈ హోటల్ కు అంత పేరు వచ్చింది.

ఈ గది రాజ శైలికి ప్రసిద్ధి చెందింది. ఇందులో రాయల్ డైనింగ్ రూమ్, డ్రెస్సింగ్ ఏరియాతో కూడిన మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటాయి. ఈ గదిలో ఒకరోజు ఉన్నారంటే.. మహారాజులా ఫీల్ అవుతారు. అలా ఉంటాయి అక్కడ ఏర్పాట్లు. చాలా మంది ప్రముఖులు ఇందులో ఉండడానికి ఇష్టపడతారు. ఛార్జీల గురించి మాట్లాడినట్లయితే అది సమయాన్ని బట్టి వేస్తారు. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. దీని ఒక రోజు అద్దె దాదాపు రెండున్నర లక్షల రూపాయలు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారేమో..మనం ఉండలేకపోవచ్చు…కానీ వాటి గురించి తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదుకదా.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news