ట్రెండ్ ఇన్: ‘సర్కారు వారి పాట’ నిర్మాతలపై మహేశ్ బాబు అభిమానుల ఆగ్రహం..నెగెటివ్ కామెంట్స్‌తో ట్రోలింగ్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మహేశ్ సినిమాలంటే ఇష్టపడుతారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న చిత్రాల అప్ డేట్స్ తెలుసుకోవాలనుకుంటారు. ఒకవేళ అప్ డేట్స్ లేట్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురవుతున్నది.

‘సర్కారు వారి పాట’ పిక్చర్ అప్ డేట్స్ ఇవ్వడంలో మేకర్స్ దృష్టి పెట్టడం లేదని మహేశ్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు సినిమా విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని కామెంట్స్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే వారు #WorstTeamSVP వరస్ట్ టీమ్ ఎస్ వీ పీ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేస్తున్నారు. ‘నీ అంత బేకారు నా కొడుకును నా జీవితంలో చూడలేదు బ్రో’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మేరకు వారు ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఫొటోలతో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలా మహేశ్ అభిమానులు పెద్ద మొత్తంలో హ్యాష్ ట్యాగ్ ట్వీట్స్ చేయడంతో #WorstTeamSVP హ్యాష్ ట్యాగ్…మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్’లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇటీవల కాలంలో అభిమానులు తమ ఆగ్రహాన్ని డిజిటల్ గా వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ కోసం వారు వినూత్నంగా డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల విజయ్ ‘బీస్ట్’ సినిమా, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఇలానే ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేసి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు. చూడాలి మరి..‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి అప్ డేట్ ఎప్పుడొస్తుందో..

Read more RELATED
Recommended to you

Latest news