మోస్ట్ పాపులర్ తెలుగు నటీనటులు వీళ్లే!

-

ఫిబ్రవరి నెలలో తెలుగు ఆడియన్స్ ఎంతగానో అభిమానించిన నటీనటుల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ‘ఓర్మాక్స్ మీడియా’ విడుదల చేసింది.ఎక్కువ మంది అభిమానాన్ని చూరగొన్న హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక రెండవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మూడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ,నాలుగవ స్థానంలో అల్లు అర్జున్, 5వ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఇక ఆ తర్వాత వరుసగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాని, రవితేజ, విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే…. మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా సమంత మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. రెండో స్థానములో కాజల్ అగర్వాల్, మూడో స్థానంలో యంగ్ బ్యూటీ శ్రీలీల, నాలుగవ స్థానంలో సాయిపల్లవి, ఐదవ స్థానంలో అనుష్క ఉన్నారు. ఆ తర్వాత వరుసగా రష్మిక మందన్న, తమన్నా భాటియా ,కీర్తి సురేష్ ,పూజా హెగ్డే ,అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news