ఈడీ అధికారులతో వాగ్వాదం… కావాలనే శుక్రవారం వచ్చారు: కేటీఆర్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు.ఈ నేపథ్యంలో కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు .శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చారు’ అని అన్నారు.సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఈడి అధికారులపైన కేటీఆర్ మండిపడ్డారు.

కాగా, ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కవితతో పాటు అనిల్ కుమార్, సిబ్బంది మొబైల్ ఫోన్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news