ఈవారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలివే..!

-

ప్రస్తుతం సమ్మర్ వచ్చిన నేపథ్యంలో చాలామంది దర్శక నిర్మాతలు ఈ సమ్మర్ ను క్యాష్ చేసుకోవడానికి సినిమాలను ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ మరింతగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

శాకుంతలం:
సమంత లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో భారీ ఎత్తున తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే సినీ ప్రేమికులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

రుద్రుడు:
సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా , నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను కలిగి ఉన్న రాఘవ లారెన్స్ తాజాగా రుద్రుడు అనే తమిళ సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల చేయబోతున్నారు . ఏప్రిల్ 14వ తేదీన రాబోతున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తోంది.

విడుదల:
విడుదలై పార్ట్ వన్ అనే పేరుతో తమిళ్లో రూపొందించిన ఈ సినిమాను తెలుగులో ఇప్పుడు ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. కమెడియన్ సూరి హీరోగా నటించిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మూడు చిత్రాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

మొత్తానికి అయితే మరో వారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఈ నెల మొత్తంగా ఏ సినిమా ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news