సినిమాలలో చిన్న చిన్నవి వేషాలు వేస్తు ప్రస్తుతం హీరో హీరోయిన్లు ఎదిగిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో రవితేజ, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి ,అడవి శేషు, అనసూయ, త్రిష తదితర హీరో హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇక ఎంతోమంది సీరియల్స్ లో మొదట తమ కెరీయర్ని మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాలలోకి వచ్చి సెలబ్రెటీస్ గా మారిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో మొదట బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఒకరిని చెప్పవచ్చు మొదట సీరియల్స్ లో కూడా నటించి ఆ తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ హీరోగా ఎదిగారు.
1). విద్యాబాలన్:
ఈమె కూడా మొదట సీరియల్స్ ద్వారా పరిచయమై.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది.
2). యామి గౌతమ్:మొదట సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాలలో కూడా నటించింది.
3). సుశాంత్ రాజ్ పుత్:
ధోని చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించారు.. సినిమాల కంటే ముందు సీరియల్స్ లో కూడా నటించారు.
4). శ్రీదివ్య:ఇక తెలుగులో కూడా అచ్చ తెలుగు అమ్మాయి గా నటించిన శ్రీదివ్య మొదట సీరియల్స్ లో నటించింది ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.
5). లావణ్య త్రిపాఠి:
ఒకప్పుడు ఈమె పలు సీరియల్స్ నటించింది.. ఆ తర్వాత అందాల రాక్షసి సినిమాతో తెలుగులో హీరోయిన్గా కూడా నటించింది.
6). మృనాల్ ఠాగూర్ :ఈమధ్య సీతారామం చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె బాలీవుడ్ లో కుంకుమ భాగ్య బుల్ బుల్ అనే సీరియల్స్ లో నటించింది.
7). యష్:కన్నడలో పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత హీరోగా స్టార్ హీరోగా మారిపోయాడు యష్.
ఇక వీరితో పాటే తమిళ హీరో విజయ్ సేతుపతి టాలీవుడ్ లో తరుణ్ కూడా చిన్న వయసులో పలు సీరియల్స్ లో నటించారు ఇక వేరే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది